Tuesday, November 26, 2024

ఆత్మ స్వరూపిణి బాలాత్రిపుర సుందరి

సర్వశక్తిమయా సర్వమంగళా సద్గతి ప్రదా
సర్వేశ్వరీ సర్వమయీ సర్వ మంత్ర స్వరూపిణీ
శరన్నవరాత్రులలో విదియ నాటి అవతారము బాలా త్రిపురసుందరి. ఈమెనే బ్రహ్మచారిణి అని
కూ డా పిలుస్తారు. పరమేశ్వరుడే తనకు పతి కావా లని కోరుకుంది. ఆమె కోరిక ప్రకారం హమవంతునికి పుత్రిక గా జన్మించింది. త్రిపురుని అర్థాంగి కావటం వలన బాలా త్రిపుర సుందరిగా కూడా పిలువబడే అమ్మ అక్షమాల, అభయముద్రతో దర్శనమిస్తూ బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారము అణచివేస్తుంది. శ్రీ చక్రంలోని త్రిపురాత్ర యంలో ఆధి దేవత కూడా త్రిపుర సుందరీదేవి. త్రిపురము లలో అంటే అన్ని లోకాలలో ఈ తల్లి సౌందర్యవతి గావున ఈ తల్లిని త్రిపుర సుందరి అని పిలుస్తారు. షోడశ విద్య కొరకు సాధకులు బాలాత్రిపురసుందరిని అర్చించాలి. ఆత్మ స్వరూ పురాలైన ఈవిడను పూజిస్తే శివానుగ్రహము ద్వారా మోక్ష ము సంప్రాప్తిస్తుంది. షోడశ వర్షిణిగా పరిగణింపబడే ఈ తల్లి భండాసురుడు అనే రాక్షస సంహారము గావించి లోకాలకు శాంతిని చేకూర్చింది. లలితా త్రిశతి స్తోత్రం అత్యంత ఫలదాయకము.
బాలాత్రిపురసుందరి మూలమంత్రము
ఐం క్లీం సౌ: సౌ: క్లీం ఐం
శ్రీశైలం దేవస్థానములో అమ్మవారిని బ్రహ్మచారిణి రూపంలోను, విజయవాడ కనకదుర్గ అమ్మవారిని బాలా త్రిపురసుందరి అవతారంలో అలంకరిస్తారు. రెండు అవతా రల పరమార్థము ఒక్కటే. పరమేశ్వరుని భర్తగా పొందేంత వరకు తల్లి బ్రహ్మచారిణిగా కొలువబడుతుంది. ఈ రోజు 9 సంవత్సరాలలోపు బాలికచే కుమారి పూజ చేయిస్తారు.
ఈ రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది. అమ్మవారిని ఆకుపచ్చ రంగు వస్త్రములతో అలంకరించి, గులాబీలతో అర్చిస్తే శుభప్రదము.
శ్లో. దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ!
దేవే ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా!!
బాలాత్రిపురసుందరి, బ్రహ్మచారిణి రూపంలో అమ్మ వారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి, తల్లి కరుణాకటాక్ష వీక్షణకు పాత్రులగుదాం.
శుభం భూయాత్‌!!

– డా. దేవులపల్లి పద్మజ
98496 92414

Advertisement

తాజా వార్తలు

Advertisement