ఆదిలోను, అంతములోను ఉండక ఏది మధ్యలో వచ్చి చేరునో అదే మిధ్యయని అస్థిరమని, నశ్వరమని జీవుడు ఎప్పుడు తెలుసు కొనునో అప్పుడు వాసనా క్షయమై ముక్తికి దారి కనిపిస్తుంది.
దృశ్య ప్రపంచాన్ని పూర్ణముగా త్యజించి సమస్తాన్ని మాయయని భావించిన తరువాత మాత్రమే వాసనలు నశిస్తాయి. వాసనతో బాటు మనస్సు పడిపోతుంది తదుపరి అధిష్టానమైన ఆత్మ మాత్రమే శేషముగా మిగిలి జీవునకు పరమానంద నిర్వాణ స్థితిని కలుగ జేసి మోక్షాన్ని సిద్ధింపజేస్తుంది. ఇంత నిగూఢమైన వైరాగ్య చింతనను పదహారేండ్ల య వ్వన ప్రాయంలో శ్రీరామచంద్రునకు వశిష్ఠముని అందించాడు. ఆ ఆధ్యాత్మిక రహస్యాల సమాహారమే శ్రీ వశిష్ఠగీత.
ధర్మ సంస్థాపన కోసం యుగ యుగాన మానవ రూపంలో అవతరించుటయే విష్ణు వాగ్దానము. మానవ రూపంలో మాధవుడు అవతరించుటయే సకల జీవులకు దశాదిశ నిర్దేశనము. అది చేయుటయే అవతార రహస్యము. చతుర్విధ పురుషార్థాలను ధర్మమార్గమున పరిపూర్ణము చేసుకొను మార్గమును ఈ తత్వ జ్ఞానము విశద పరిచింది.
చరా చరా సృష్టికి మూల కారకుడైన పరమాత్మ మానవ రూపమున శ్రీరామచంద్రునిగా అవతరించి వసిష్ట మహామునిని నేనవరను? ఈ ప్రపంచము యేమి? ఈ సంసారమున సుఖమేమున్నది? అని వైరాగ్యంతో ప్రశ్నించుట ఆశ్చర్యము కలిగించక మానదు. తన గురువైన వసిష్ఠుని ద్వారా మానవులకు సృష్టి రహస్యములు తెలియ జేయుట కోసమే రాముడు ఆయనను ప్రశ్నించాడు. గురువు ప్రాధాన్యతను కూడా తెలియజేసాడు. అహంకారరహితముగా జ్ఞానాన్ని పొందాలని దీని అంతరార్థ ము. కోరికలను, ఆశలను త్యజించి ఆత్మయందు మౌనముగా ఉండటం కంటే ఉత్తమమైనది ఏదీ లేదని బ్రహ్మ తనయుడైన వసిష్టుడు ప్రామాణికమైన బోధ చేశాడు.
యాగ సంరక్షణార్థమై రామ లక్ష్మణులను తన వెంట పంపా లని విశ్వామిత్ర మహర్షి కోరగా పుత్ర వాత్సల్యముతో దశర థుని మనసు అనుమతించలేదు. అదే సమయాన శ్రీ రామచం ద్రుడు ప్రాపంచిక రాజ్య భోగాలపై విరక్తి పొంది, తన ఉనికితనకే ప్రశ్నా ర్థకమవగా సందేహాస్పదుడై హృదయతాపము తో పరితపించు చున్నాడు. అటువంటి మహత్తర సందర్భంలో త్రికాలజ్ఞుడైన, రఘుకుల గురువైన వసిష్ఠ మునీంద్రుడు శ్రీ రామచంద్రునికి ఆత్మ జ్ఞానమును బోధించాలని స్వయంగా విశ్వామిత్రుడు కోరినాడు.
సకల దేవతలు, రుషి పుంగవులు సభయందు ఆశీనులై ఉండగా ఇరువది దినములు వసిష్ఠుడు చేసిన తత్వ జ్ఞాన ప్రసంగ ములే యోగ వాసిష్ఠము. దీనినే వాసిష్ఠరామాయణమని, శ్రీ వసిష్ఠ గీతయని కూడా అంటారు. ఇందు శ్రీరామ
వసిష్ఠుల సంవాద రూపములో అనేక ఆధ్యాత్మిక రహస్య ములు ఉన్నాయి. అవి మనకు జ్ఞానోదయము కలిగిస్తాయి.
అనేక జన్మల నుండి కోరికలు, అలవాట్లు, అభ్యాసాలు, సంస్కరణలు, సంస్కారములు అన్నీ కలిసి ఏర్పడి నదే జన్మాంతర వాసన. మానవుడు పూర్వజన్మ వాసనల నుండి బయటపడలేక తిరిగి అవియే సత్యమని తలచి జన్మ జన్మల భ్రాంతిలో పడి కొట్టుకొంటూ తిరిగి జనన మరణ చక్రములో భ్రమిస్తున్నాడని తెలియజేస్తుంది.
వాసనాక్షయమైన అంత: చతుష్టయము మోక్షమునకు అర్హత పొందుతుందని వసిష్ఠ గీత విపులీకరించింది. ధర్మ సంస్థాపనకు తన జన్మను వినియోగించుటయే కర్తవ్యమని, అదియే ఆనందమయమై అనంతమైన పరమాత్మలో వీనమవుతుందని బోధిస్తున్నది. దృశ్య ప్రపంచమున అరిషడ్వర్గ ములకు లోనయిన జీవులు దు:ఖమునే సుఖమనుకుని నిత్య పరితాపములో మునిగి నశిస్తాయి. అజ్ఞానముతో జన్మను సార్థక మొనరించుకొనక విషాదములో మునిగిపోతుంటాయి.
ధర్మ సంస్థాపనలో మానవుడు తన కర్తవ్యమును నిర్వహిం చుటకు మార్గ దర్శనము చేసిన దైవదత్తమైన ఆత్మ జ్ఞాన బోధ నలే భగవద్గీత, వసిష్ఠ గీతలు. త్రేతాయుగములో వాల్మీకి, ద్వాప ర యుగములో వ్యాసుడు వంటి అవతార పురుషుల మహిమా న్విత బోధలు గ్రంథస్థము చేసి మన కందించిన గొప్ప ఆధ్యాత్మిక ఆయుధములు. భారతీయ ఆధ్యాత్మిక సంపదలో లోక కళ్యాణ మునకు ఉద్భవించిన మణి పూసలు. ఏ జీవీ సోమరి కాకుండా కర్మాచరణకు సరైన మార్గమును చూపిన తత్వరాజములు.
యుద్ద విముఖుడైన అర్జునునకు శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతను , వైరాగ్య చింతనలో మునిగి శ్రీరామచం ద్రునకు వసిష్ఠ మహాముని శ్రీ వసి ష్ఠ గీతను బోధిం చి కార్యోన్ముఖులను గావించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశారు. వీటి సార మును గ్రహించి జన్మసార్థక ము చేసు కోవడం వివేకం.
వి.వి.ఎస్. కామేశ్వరరావు
80746 66269