Saturday, November 23, 2024

ఆంతరిక ఆటంకాలు (ఆడియోతో…)

ఆధ్యాత్మిక ఉన్నతికి అతి పెద్ద ఆటంకం వ్యక్తిలోని చెడు స్వభావమే. ఇటువం టి స్వభావానికి మూల కారణము- సంకుచిత మనస్తత్వము. ఈ వ్రేళ్ళను పూర్తిగా తొలగించాలి, ఎందుకంటే చెడు స్వభావం నుండి వచ్చే ఆటంకాలు భగవంతుడి నుండి శక్తిని తీసుకోకుండా అడ్డుకుంటాము.

భగవంతుడు నా వాడు అన్న అవగాహన, విశ్వాసము ఉన్నప్పుడు భగవంతుడి నుండి శక్తిని తీసుకోవడం సాధ్యమవుతుంది. చెడు స్వభావము ఈ నమ్మకాన్ని కూడా నాశనం చేస్తుంది.

సమస్య మూలాన్ని గుర్తించడం ద్వారా దాని పరివర్తన వీలవుతుంది. సంకుచిత ఆలోచనా విధానమును సహించకూడదు. ఆంతరికంగా సంపూర్ణ స్వచ్ఛత ఉండాలి. ఇందుకు, నువ్వు ఎదురుకుంటున్న ఆటంకాల పట్ల ఎంతో నిజాయితీగా వ్యవహరించాలి. ఎందుకంటే నిన్ను నువ్వు మోసగించుకోవడం చాలా సులువు. నీ మూల స్వభావాలైన శాంతి, ఇతరులకు సహకరించడము గురించి అవగాహన పెంచుకుంటూ ఉండటం ద్వారా నీలోని సంకుచిత ఆలోచనను మార్చుకోవచ్చు.

-బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement