సాయిబాబా హిందువా, ముస్లిమా అనే చర్చ ఎప్పుడూ వుంది. స్వయంగా తనది ఫలానా మతమని ఆయన ఏనాడూ చెప్పలేదు. మసీదులో ఉన్నప్పటికీ భగవద్గీత, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం పట్ల అవగాహనగల ఉదాత్త మానవుడు సాయిబాబా. బాబా జీవిత చరిత్రని రాసిన అనేకమంది ఆయన్ని హిందువుగా పేర్కొన్నారు. కొందరు ముస్లింగా తలపోశా రు. సూఫీతత్వాన్ని విశ్వసించిన ఫకీరుగా భావించారు. బాబా వేషధారణ ఫకీరు ను పోలి వుంటుంది. కనుక ఆయన్ని ఫకీరు అనుకున్నారు. తన గురించి ఎవరు ఏంమాట్లాడుకున్నా బాబా పట్టించుకోలేదు. అందరినీ మానుష దృష్టితో చూశా రు. వారు అనుసరించే సకల మతాల్ని ఆదరించారు. ఒకదానిని వ్యతిరేకించడం, మరొకదానిని అనుకూలించడం చేయలేదు. జనాలకు మతాలపట్ల వున్న నమ్మ కాల్ని ప్రశ్నించలేదు. అదే సమయాన మతవివక్ష చూపినప్పుడు సహించకుండా కోప్పడేవారు. బాబా తొలుత కొన్నిరోజులు వేపచెట్టు కింద వున్నారు. తరువాత కొన్ని నెలలు మసీదులో ఉన్నారు. మరల బయటికి వచ్చారు. తిరిగి మరికొంత కాలానికి మసీదుకు వచ్చి మహాసమాధి చెందేవరకు మసీదులోనే గడిపారు. మసీదులో వున్నప్పటికీ దీపారాధన చేశారు. సాయంత్రాలు దీపాలు వెలిగించే వారు. దీపాలు పెట్టడం ఆయనకు ఇష్టమైన కార్యక్రమంగా వుండేది. అందుకని దీపాలు వెలిగించేవారు. షిరిడిలోని మారుతి ఆలయంలోకి వచ్చే భక్తులతో ముచ్చ టించేవారు. మసీదులో వుండి కూడా భజనలు చేసేవారు. ఆరతి ఇచ్చేవారు.
సాయిబాబాని సర్వదేవతా స్వరూపం. ఉపనిషత్తుల సారాన్నీ, భగవద్గీత బోధన ల్లోని సారాంశాన్నీ భిన్న సందర్భాల్లో బాబా విశ్లేషిస్తూ చెప్పేవారు. ”సాయి ముస్లిం. ఆయనకు వేదాంతమేమి తెలుసు?” అన్నవారు వున్నారు. కానీ బాబాని శ్రీదత్తావతారంగా చెబుతారు. అంతేగాక ఎవరు ఏ రూపాలలో తలపోస్తే ఆవిధం గా కనిపించే దివ్యశక్తి సాయిబాబా అన్నారు. ముస్లింలు ఎంతగా తమవాడిగా భావించారో, హిందువులు కూడా తమ మనిషిగా భావించారు. ఈ రెండింటికీ భిన్నంగా మహిమాన్వితుడు, మానవోత్తముడు బాబా అని ఆరాధించినవారు అనేకులు ఎవరు వచ్చి అడిగినా తమ ఆశీస్సులు అందించారు.
అసలైన లౌకికవాది సాయి!
Advertisement
తాజా వార్తలు
Advertisement