అర్థము అనగా డబ్బు- ధనం, సంపద అనగా ఐశ్వర్యము. అధిక సంపదగలవారిని ఐశ్వర్యవంతులంటారు. వీటి ద్వారా మానవులకు అహంకారం పెరుగుతుంది. అహం వదిలితే అన్నీ శుభాలే కల్గుతాయని , ఇది నిత్య సత్యమనీ యోగ వాశిష్టంలో శ్రీ రామచంద్రునికి వశిష్ట మహర్షి ఉపదేశించిన సందేశం. వీరిద్దరి మధ్య జరిగిన సంవాదమే వసిష్టీగీతగా, వసిష్ట గీతగా , వాసిష్ట రామాయణంగా జగతిలో ప్రసిద్ధి గాంచింది.
శ్రీ రామచంద్రుడు, గురువైన వసిష్టునితో, మునీంద్రా! అహం కారం అంటే ఏమిటి? ఎలా ఉంటుంది? దానిని వదలడం ఎలా? దానిని వదిలినందువల్ల కలిగే ఫలితం ఏమిటి? అని ప్రశ్నించాడు.
మహర్షి రామునకు సంపద, అహంకారాల స్వభావాదులను మనోజ్ఞంగా వివరిస్తూ ”రామా! అహం అంటే నేను, నాది అని అర్థ ము. దీనినే అహంకారం అంటారు. ఇది స్థితి ప్రకరణంలోని విష యం శ్రద్ధగా విను” అంటూ-
శ్లో|| అనర్థాయార్థ సంపత్తి: భోగా ఘోభవ రోగద:
ఆపద సంపద స్సర్వత్రా నాద రోజయ: అంటూ
”అర్థ సంపద అనర్థానికి కారణం అవుతుంది. భోగాలు సంసా ర రోగాన్ని కలిగిస్తాయి. సంపదలన్నీ ఏ రూపంలో వున్నా అవి ఆపదలకు మూలం. కావున మనం వేటి యందు ఆసక్తి లేకుండా ఉండడమే జయాన్ని కలిగిస్తుంది. సదాచారపరుడూ, ధ్యానాసక్త చిత్తుడూ, సంసారసుఖములందు ఆశ, ఆసక్తి లేనివాడూ, ఆయుర్దా యము- కీర్తి అనే వాటిని సంపదతో పాటు పొందుతాడు.
సంసార సాగరాన్ని దాటుటకు సజ్జన సేవ తప్ప- తపస్సులు- తీర్థయాత్రలు- శాస్త్రములు జపాలు ఉపయోగపడవు. రోజు రోజు కు లోభ మోహ రోషములు తగ్గిపోతున్నవాడూ, శాస్త్ర విధి ప్రకా రం కర్మల నాచరించువాడే సజ్జనుడు. సచ్చీలుడు.
నేను అనే శబ్దానికి అర్థం తెలియకపోతే మనస్సనే ఆకాశంలో అది ఒక కళంకంలా ఉంటుంది. జ్ఞానం అనేది వెన్నెల లాంటిది. అది అహంకారం అనే మేఘం చేత కప్పబడి వున్నంతవరకు కైవ ల్యం కలుగదు. సిద్ధించదు. కైవల్యం అనగా మోక్ష ప్రాప్తి జరగదు. అహంభావం ఎన్నడూ చావని వృక్షాల వంటి జన్మలకు బీజం అవు తుంది. నాది అనే మమకార దు:ఖాలనే ఫలాలకు కొమ్మ లాంటిది” అని మహర్షి రామునకు తెలిపాడు.
శ్రీ రాముడది విని ”మునీంద్రా! అహంకార స్వరూప స్వభా వాలను తెలియజేయండి” అని కోరాడు. ముని ”రామా! అహం కారము మూడు విధములుగా ఉంటుంది. వాటిలో రెండు రకాలు శ్రేష్టమైనవి. ఒకరకం విడువదగినది. వీటిని వివరిస్తాను శ్రద్ధగా ఆలకించు. ఈ సమస్త జగత్తునూ నేనే. నేనే పరమాత్మను! నా కంటే వేరుగా ఏదియూలేద అనుకోవడం శ్రేష్టమైన అహంకారం. ఈ అహంకారం బంధాన్ని కలిగించదు. ఇలాంటి అహంకారం జీవ న్ముక్తునకే ఉంటుంది. నేను దేహేంద్రియాలకంటే లక్షణుడను. వెంట్రుక కొన యొక్క నూరో భాగమైన అణు స్వరూపుడనై యున్నాను. అనే బుద్ధి రెండో రకానికి చెందిన అహంకారం. ఇదీ మోక్షదాయకమే. బంధకమైనది కాదు. ఈ అహంకారం జీవన్ము క్తునికే ఉంటుంది.
నేను కాళ్ళు చేతులు కలవాడను అనే అహంకారం మూడో రకానికి చెందినది. ఇది ప్రాపంచికమై తుచ్ఛమైనది. ఈ అహంకా రంగల వాడు అథోగతి పొందుతాడు. ఈ దేహమనే అనే మూడవ అహంకారం సంసార జాలానికి మూలంగా ఉన్న దీనిని వదిలి పెట్టాలి. దీనిని క్రమంగా వదిలేస్తే మిగతా రెండు రకాల అహంకా రాలు ఉండి శీఘ్రంగా ముక్తిని పొందుతాడు. మొదటి రెండు అహంకారాలను తలచుకుంటూ ఉంటే పురుషుడు పరతత్వాన్ని పొందుతాడు. క్రమంగా ఆ రెండు అహంకారాలను సైతం వదిలితే శాశ్వతమైన బ్రహ్మపదాన్నే పొందుతాడు. మూడోదైన దురంహం కారాన్ని వదిలివేస్తే అతని శరీర స్థితి పుణ్యవంతమవుతుంది అని అహంకార స్వరూపాన్ని వివరించాడు మహర్షి. మోహం వలన అహంకారానికి లోనవుతూ ఉంటారు.
అహంకార విషయాలను శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చక్కగా పలు శ్లోకాల ద్వారా లోకానికి సందేశం అందించారు.
16వ అధ్యాయంలో ”అహంకారం- బలం- దర్పం- కామం క్రోథంచ సంశ్రిత:” అంటూ అహంకారం ఆసురీలక్షణమనీ, మను జులు ఎంత బలం ధనం- కీర్తి- ఐశ్వర్యమున్నప్పటికినీ, చిత్త శుద్ధి లేనిచో పతనం పొందుతారు. అహంకారం అనే గర్వాన్ని వదలాలి.
అహంకారం వలన అసూయ- కామ- క్రోధ- లోభ మోహాలు ఏర్పడతాయి. ఇవి గల వారికి వినయ విధేయతలుండవు. ధన మదము, ధనాభిమానం కలిగి ఉంటారు. పరుల మేలుజూచి ఓర్వ లేరు. దీనినే అసూయ అంటారు. అహంకారం వదలాలంటే మనో నిగ్రభం, నిర్మల బుద్ధి- రాగ ద్వేష పరిత్యాగం కావాలి. మిత ఆహా రం సేవించాలి. మనో వాక్కాయ కర్మలను స్వాధీనం చేసుకోవాలి. మమకారాలను దూరం చేసుకుని శాంత చిత్తులై యుండాలి.
శబ్ద, స్పర్శాది విషయాలను విడిచి పెట్టాలి. ఓర్పు- నేర్పుకలిగి ఉండాలి. డంబమును, గర్వమును , నేను నాది అనే భావనలను అభ్యాసం ద్వారా వదిలి పెట్టిననాడు జ్ఞానవంతులౌతారు. అని గీతలో పరమాత్మ అహంకార పరిత్యాగ మార్గాలను వివరించుట లోక కళ్యాణ కోసమే గదా! రామా ముందు ఆత్మ జ్ఞానం పెంపొం దించుకుని వాసనారాహిత్యాన్ని పొందు. వాసనా రహితమైన మనసు ముక్తమనీ ఆర్యులు తెల్పిన సత్యమిది. అహంకార పరిత్యా గమే మోక్ష సాధకమని తెలుసుకో. ఆపదలు కలిగినప్పటికీ అక్రమా లకు పాల్పడరాదు. క్షీరసాగర మధన వేళ రాహువు అక్రమం వల్లనే అమృతం తాగినా మరణించాడు. సద్గుణాల చేత కీర్తిని పొందిన వానికి అందరూ వ శులౌతారు. ఆపదలు నశిస్తాయి. అక్షయమైన శ్రేయాలు కలుగుతాయి. శోక ము- భయము- కామము- కౌటిల్యం లేకుండా నడుచుకుంటే అహంకారం దానంతట అదే తొలగి జ్ఞానం లభిస్తుంది. అవిద్య నశించి సన్మార్గగాములై చరిస్తార”ని కుల గురువు వసిష్టులవారు శ్రీరామునికి అహంకార మమకారాల వ్యత్యా సాన్నిఉపదేశించి జ్ఞానవంతుని గావించుట, లోకోపకారం కొరకేనని తెలిసి మసలాలి.
– పి.వి .సీతారామమూర్తి
9490386015