ధర్మాన్ని రక్షించే వారిని ధర్మమే రక్షిస్తుంది. పాండు కుమా రులు ధర్మపరులు. ధర్మాన్ని కాపాడడంలో, బ్రాహ్మణ రక్షణలో వారు ఎల్లప్పుడు ముందే ఉంటారు. వారికి శ్రీకృష్ణుని, బ్రాహ్మణుల, గురువుల, పెద్దల ఆశాద్వారాలు కొండంత ఉంటాయి. కాబట్టి విజయం ఐశ్వర్యము వారి వెెంటే నడుస్తాయి. ఒకసారి బ్రాహ్మణుని గోధనాన్ని కాపాడటానికి అర్జునుడు తన సోదరులతో పాటు పెట్టుకున్న నియమాన్ని ఉల్లఘించాల్సి వచ్చింది. అందుకోసం అతడు తీర్థాటనకు వెళ్ళడానికి నిర్ణయించు కున్నాడు. అర్జునుడు పరమ ధర్మపరుడు. కాబట్టి తన అన్నగారైన ధర్మరాజుని నియమోల్లంఘనను పట్టించుకోవద్దని చెప్పినా నియ మాన్ని పాటించి తీ ర్థయాత్రకు బయలు దేరాడు. ధర్మాన్ని రక్షించే వారికి సర్వ మంగళమే చేకూరుతుందని నిరూపించేదే అర్జునుని తీర్థయాత్ర వివరాల కథ.
నియమోల్లంఘనయే ప్రాయశ్చిత్తంగా అర్జునుడు గంగాస్నానం చేయడానికి దిగగానే అతనిని కామించిన ఉలూపి అనే నాగకన్య అతనిని పట్టుకుని తన లోకానికి తీసుకుని పోయింది. నాగలోకానికి చేరిన అర్జునుడు తన ను నాగలోకానికి ఎందుకు తీసుకుని వచ్చావని? ఆమె వివరాలు ఏమిటని? అడిగాడు. దానికి సమాధానంగా నాగకన్య ”ఓ వీరుడా నేను ఉలూపిని, నిన్ను ప్రేమించాను. నన్ను చేపట్టి నా కోరికను తీర్చు” అని అడిగింది.
ఆమె కోరికను విన్న అర్జునుడు ధైర్య చిత్తంతో పలుకుతూ ”తాను బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నానని, తీర్థయాత్ర చేస్తున్నానని నియమ భంగం చేయడం సాధ్యం పడ”దని చెప్పాడు.
దానికి ఉలూపి ”మా లోకంలో మా ధర్మాచరణమే విఘ్నం రాదు. ద్రౌపదితో మీరు పెట్టుకున్న నియమం భూలోకానికి సంబంధించినది. ఇతరుల స్త్రీల విషయంలో ఈ నియమం వర్తిం చదు. దానితో అర్జునుడు ఆమె మాటను సమ్మతించి ఆ కన్యను చేపట్టి ఆమెతో ఆ రాత్రి గడిపాడు. ”తనతో కలిగిన సంబంధం వల న ఇక ఎటువంటి జలచారాలతో ప్రాణ భయం ఉండద”ని ఉలూపి అర్జునునికి వీడ్కోలు సమయంలో వరం ఇచ్చింది.
అర్జునుడు తిరిగి భూలోకానికి వచ్చి, గంగానది తీరమున నున్న మునులకు తన అనుభవము వివరించి చెప్పి, ప్రయాణము కొనసాగించాడు. ప్రతిచోట వారు తీర్థస్నానాలు చేస్తూ, గోదానాలు
చేస్తూ ముందుకు సాగారు. చివ రకు వారు కళింగ దేశానికి చేరు కున్నారు. అక్కడ
అర్జునుడు శ్రీ జగన్నాథ స్వామిని దర్శించి మహేంద్ర పర్వతం సమీపంలోని మగిపురానికి చేరుకున్నారు. ఆ దేశ రాజు చిత్రవాహకుడు. అతని కుమార్తె చిత్రాం గద. అర్జునుడు ఆమెను ప్రేమించాడు. చిత్రాంగదను తనకిచ్చి వివాహం చేయమని అర్జునుడు చిత్రసేన మహరాజును కోరాడు.
మహారాజు అర్జునునితో ”మా వంశంలో అనేక తరాల నుండి ఒకే ఒకరు వారసులుగా పుడుతున్నారు. చిత్రాంగద నా ఏకైక పుత్రిక. ఆమెయే నా సర్వస్వము. ఆమెకు పుట్టినవారు ఈ రాజ్యా నికి వారసులవుతారు. ఆమెకు పుట్టి వారిని తనకు దత్తపుత్రునిగా ఇవ్వాలి” అని చెప్పాడు. అర్జునుడు దానికి సమ్మతించి చిత్రాంగద ను వివాహం చేసుకున్నాడు. అర్జునుడు, చిత్రాంగదలకు ఒక పుత్రు డు జన్మించాడు. ఆ పిల్లవాడికి బబ్రువాహనుడు అనే పేరు పెట్టి చిత్ర వాహకునికి (చిత్ర సేనునికి) దత్తపుత్రునిగా ఇచ్చారు.
తరువాత అర్జునుడు తీర్థయాత్ర కొనసాగింది. సముద్ర తీరం లో ఉన్న అగస్త్య తీర్థం, సౌభధ్ర తీర్థం, పాలోమా తీర్థం, కారంధమ తీర్థం, భరద్వాజ తీర్థాలకు వెళ్ళాడు. కాని ఆ తీర్థాలలో ఏ రుషులు స్నానం చేయరు. ఎందుకంటే అందులో ఉండే మొసళ్ళ భయమే దానికి కారణం. కాని అర్జునుడు ధైర్యంతో సౌభద్ర తీర్థంలో స్నానం చేశాడు. అందులో ఒక మొసలి అతని కాలును పట్టుకుంది. కాని అర్జునుడు దానిని ఎత్తి పైకి లాగాడు. దానితో ఆ మొసలికి శాప విమోచనం కలిగి ఒక అందమైన అప్సరసగా అయింది. ఆమె తన కు, తన చెలులకు కలిగిన శాపాన్ని చెపుతూ వారిని కూడా శాప విముక్తులను చేయమని అడిగింది. ఉలూపి ఇచ్చిన జలచర హాని రాహిత్య వరంతో అర్జునుడు మిగిలిన నాలుగుతీర్థాలలో కూడ స్నానం చేసి అప్సరసలందరిని ఉద్ధరించాడు.
ఆ విధంగా అర్జునుడు మళ్ళీ తీర్థయాత్రలు చేస్తూ పడమటి సముద్ర తీరానికి చేరుకున్నాడు. అర్జునుడు తన చెలికాడైన శ్రీకృష్ణు ని దర్శించి పరమానందం అనుభవించాడు. కృష్ణుని చెల్లెలు సుభద్రను ధర్మరాజు అనుమతితో వివాహమాడెను. వివాహము తర్వాత అర్జునుడు సుభధ్రతో పాటు ద్వారకలోనే కొంత కాలము ఉన్నాడు. చివరకు పుష్కర తీర్థయాత్రలు ముగించుకుని నియమోల్లంఘనకు ప్రాయశ్చిత్తం చేసుకుని, సుభధ్రతో ఇంద్ర ప్రస్థానానికి వెళతాడు. కొంత కాలము తరువాత అర్జునుని ద్వారా సుభధ్రకు వీరాభిమాన్యుడు జన్మించాడు.
– కోసూరు హయగ్రీవరావు
99495 14583