రాగం : కురంజిరాగం
ఆదితాళం
ప|| ముద్దుగారే యశోద ముంగిటి ముత్తెము వీడు
తిద్దురాని మహిమల దేవకీ సుతుడు || || ముద్దు ||
చ|| అంత నింత గొల్లెతల అరచేతి మాణికము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస
చెంతల మాలోనున్న చిన్నికృష్ణుడు ||
చ|| రతికేళిర రుక్మిణికి రంగుమోవి పగడము
మితి గోవ ర్ధనపు గోమేధికము
సతమై శంఖచక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ము గాచే కమలాక్షుడు || || ముద్దు ||
చ|| కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము
ఏలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము
పాల జలనిధిలోన పాయన దివ్యరత్నము
బాలుని వలె తిరిగీ పద్మనాభుడు || || ముద్దు ||