రాగం : శుద్ధ ధన్యాసి రాగం
ఆదితాళం
ప || భావములోన బాహ్యము నందును
గోవింద గోవింద యని కొలువరో మనసా|| || భావము ||
చ|| హరియవతరాములే అఖిల దేవతలు
హరిలోనివే బ్రహ్మాండంబులు
హరి నామములే అన్ని మంత్రములు
హరి హరి హరి హరి హరి యనవోమనసా|| ||భావము||
చ|| విష్ణువు మహిమలే విహిత కర్మములు
విష్ణుని పొగడెడి వేదంబులు
విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు
విష్ణువు విష్ణువని వెదకవో మనసా|| ||భావము||
చ|| అచ్యుతు డితడే ఆదియు నంత్యము
అచ్యుతుడే అసురాంతకుడు
అచ్యుతుడు శ్రీ వేంకాలాద్రి మీద నిదె
అచ్యుత అచ్యుత శరణనవో మనసా|| ||భావము||