Friday, November 22, 2024

అన్మమయ్య కీర్తనలు : కొండలలె నెలకొన్న

రాగం : హిందోళ రాగం
ఆదితాళం

పం|| కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొడలంత వరములు గుప్పెడువాడు || || కొండలలో ||

చ|| కుమ్మర దాసుడైన కురవరత్తినంబి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
దొమ్ములు చేసినయట్టి తొండమాన్‌ జక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు || || కొండలలో ||

చ|| అచ ్చపు వేడుకతో అనంతాళువారికి
మచ్చిలి వెట్టికి మన్నుమోచిన వాడు
మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత
ఇచ్చినిచ్చ మాటలాడి నచ్చిన వాడు || || కొండలలో ||

చ|| కంచిలోన నుండ తిరుక్కచ్చి నంబి మీద కరు
ణించి తన యెడకు రప్పించిన వాడు
ఎంచనెక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ పాలించినవాడు || || కొండలలో ||

Advertisement

తాజా వార్తలు

Advertisement