Sunday, November 24, 2024

అన్మమయ్య కీర్తనలు : ఎంతమాత్రమున

రాగం : బృందావని, మాయామాళవగౌళ రాగమాలిక- మిశ్రచాపుతాళం

ప|| ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు
అంతరాంతరము లెంచి చూడ పిండంతే నిప్పటి యున్నట్లు|| || ఎంత ||

చ|| కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికు లాదిభైరవుండనుచు || || ఎంత ||

చ|| సరి నెన్నుదురు శాక్తేయులు శక్తిరూపు నీవనుచు
దరిశనములు మిము నే యల్పబుద్ధి దలచిన వారికి అల్పంబవుదువు
సిరుల మిము నే ఘనమని దలచిన ఘన బుద్ధులకు ఘనుడవు
గరిమల మిము నే ఘనమని దలచిన ఘన బుద్ధులకు ఘనుడవు

నీవలన కోరితే లేదు మరి నీరు కొలది తామెరవు
ఆవల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవముని
ఈవల నే నీ శరణననెదను ఇదియే పర తత్త్వము నాకు || || ఎంత ||

Advertisement

తాజా వార్తలు

Advertisement