Saturday, November 23, 2024

అన్మమయ్య కీర్తనలు : ఉగ్గు వెట్టరే

రాగం : ఖమాస్‌
ఉగ్గు వెట్టరే వోయమ్మా చె
య్యొగ్గీనిదె శిశు వోయమ్మా || ఉగ్గు వెట్టరే||

కడుపులోని లోకమ్ములు గదలీ
నొడలూచకురే వోయమ్మా
తొడికెడి సరుగన తొలగ దీయరే
వుడికెడి పాలివి వోయమ్మా || ఉగ్గు వెట్టరే||

చప్పలు వట్టుక సన్నపు బాలుని
నుప్పర మెత్తకురోయమ్మా
అప్పుడె సకలము నదిమీనోరనె
వొప్పదు తియ్యరె వోయమ్మా || ఉగ్గు వెట్టరే||

తొయ్యలు లిటు చేతుల నలగించక
వుయ్యల నిడరే వోయమ్మా
కొయ్యమాటలను కొండల తిమ్మని
నొయ్యన తిట్టకురోరమ్మా || ఉగ్గు వెట్టరే||

Advertisement

తాజా వార్తలు

Advertisement