Friday, November 22, 2024

అన్నము అంటే ఏమిటి

అన్నం పరబ్రహ్మ స్వరూపం!
మనలో చాలామందికి ”అన్నము” అంటే తెలియదు. బియ్యాన్ని ఉడికించి చేసిన పదార్ధాన్నే అన్నము అంటారని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ప్రతి మనిషికి పంచ కోశములు అని అయిదు కోశములు ఉంటాయి.
అవి 1 అన్నమయ, 2 ప్రాణమయ, 3 మనోమయ, 4 విజ్ఞానమయ, 5 ఆనందమయ కోశములు. అన్నమయ కోశము స్థూల శరీరానికి సంబంధించినది. ఈ అన్నమయ కోశములో ప్రవేశించే అన్నము ప్రాణశక్తిగా మారుతున్నది. కనుక అన్నమయ కోశాములోనికి వెళ్ళే ఆహారమే అన్న ము అని అర్ధం. అంతేకాదు. తైత్తిరీయోపనిషత్తులో అన్నము వలననే భూత జాతములు జనించుచున్నవి. అన్నము వలననే జీవించుచున్నవి. తుదకు అన్నము నందే (భూమి) నశించుచున్నవి లేక లయించుచున్నవి అని చెప్పబడి ఉంది. మనము ఏది తిన్నా అది అన్నమే అవుతుంది కేవలం బియ్యం ఉడికించినది మాత్రమే కాదు అని అర్ధం చేసుకోవాలి.
అన్నదానం అంటే ఏమిటి?
అన్నమే అన్నకోశములో ప్రవేశించి ప్రాణంగా మారు తున్నందు వలన అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయ డమే. అంతేకాదు ఒక ప్రాణం నిలవడానికి కావలసినవన్ని అన్నమే. కనుక అన్నదానం చేయడం శ్రేష్టం అని, అన్ని దానములకెల్ల అన్నదానం మిన్న అని, శాస్త్రాలు చెప్తున్నా యి. ఏదైనా దానం చేసేప్పుడు విచక్షణ అవసరం కానీ అన్న దానానికి మాత్రం ఈ నియమం లేదు. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలపడమే కనుక అది అత్యంత శ్రేష్టం అయినది.

Advertisement

తాజా వార్తలు

Advertisement