వీధుల వీధుల
రాగం : శుద్ధ సావేరి
వీధుల వీధుల విభుడేగేనిదె
మోదము తోడుత మొక్కరో జనులు || వీధుల వీధుల ||
గరుడ ధ్వజమదె కనకరధంబదె
అరదముపై హరి అలవాడే
ఇదుదెసలనున్నారు ఇందిరయు భువియు
పరగ పగ్గములు పట్టరో జనులు || వీధుల వీధుల ||
ఆడేరదివో అచ్చరలెల్లరు
పాడేరు గంధర్వ పతులెల్ల
వేడుకతో వీడె విష్వక్సేనుడు
కూడి ఇందరును కొలువరో జనులు || వీధుల వీధుల ||
- Advertisement -
శ్రీ వేంకటపతి శిఖరముచాయదె
భావింప బహువైభవములవె
గోవింద నామపు ఘోషణలిడుచును
దైవం బితడని తలచరో జనులు || వీధుల వీధుల ||