రాగం : మోహన
సిరితొడపైనిడి
సిరితొడపైనిడి శ్రీ నరసింహుడు
యిరవుగ వరముల నిచ్చీని వాడే || సిరితొడపైనిడి ||
ఘన మగుకోరలు కరాళవదనము
చెనకుచు గొడసెటి జిహ్వయును
నినువుగ టమరలు నిటలలోచనము
వొనరగ కొలువై యున్నాడు వాడే || సిరితొడపైనిడి ||
చటులచక్రకరంబును శార్జకరంబును
అటు వరదాభయహస్తములు
పటుతర యోగపుపట్టబంధమును
కటితటి జెటగగ గడగీ వాడే || సిరితొడపైనిడి ||
పరపగు శేషునిపడగల నీడల
అరుదగు రవిచంద్రాంకముల
సిరులగద్దెపై శ్రీ వెంకటేశుడు
పరిపూర్ణుడై పరగీ వాడే || సిరితొడపైనిడి ||