Tuesday, November 26, 2024

అన్నమయ్య సంకీర్తనలు

రాగం : జోన్‌పురి
హరినామమే కడు ఆనందకరము
మరుగవో మరుగవో మరుగవో మనసా || హరి నామమే ||

నళినాక్షుని శ్రీనామము
కలిదోషహరము కైవల్యము
ఫలసారము బహుబంధమోచనము
తలచవో తలచవో తలచవో మనసా || హరి నామమే ||

నగధరునామము నరకహరణము
జగదేక హితము సమ్మతము
సగుణ నిర్గుణము సాక్షాత్కారము
పొగడవో పొగడవో పొగడవో మనసా || హరి నామమే ||

కడిగి శ్రీ వేంకటపతి నామము
బడిబడినే సంపత్కరము
అడియాలంబిల సతి సుఖమూలము
తడవవో తడవవో తడవవో మనసా || హరి నామమే ||

Advertisement

తాజా వార్తలు

Advertisement