పరమ పురుషుడు
పరమ పురుషుడు గోపాలబాలుడైనాడు
మురహరుడు ఎదుట ముద్దుగారీ నిదివో || || పరమ పురుషుడు ||
వేదపురాణములలో విహరించే దేవుడు
ఆదిమూలమైనట్టి అల బ్రహ్మము
శ్రీదేవి పాలిట చెలిగే నిధానము
సేదదేరి యశోదకు శిశువాయ నిదివో || || పరమ పురుషుడు ||
మొక్కేటి నారదాదుల ముందరి సాకారము
అక్కజపు జీవులలో అంతర్యామి
గక్కన బ్రహ్మకొడుకుగా కన్న పరమము
అక్కరతో వెన్నముచ్చై ఆటలాడి నిదివో || || పరమ పురుషుడు ||
దేవలతల గాచుటకు దిక్కైన విష్ణుడు
భావములు ఒక్కరూపైన భావతత్వ్తము
శ్రీ వేంకటాద్రి మీద చేరియున్న ఆ వరదుడు
కైవసమై గొల్లెతల కౌగిళ్ళ నిదివో || || పరమ పురుషుడు ||