నిత్యపూజలివివో
నిత్యపూజలివో నేరిచిన నోమా
ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి || ||నిత్యపూజలివివో ||
తనువే గుడియట తలయే శిఖరమట
పెనుహృదయమే హరి పీఠమట
కనుగొన చేపులే ఘనదీపములట
తన లోపలి అంతర్యామికిని || ||నిత్యపూజలివివో ||
పలుకే మంత్రమట పాదైన నాలికే
కలకలమను పిడి ఘంటయట
నలువైన రుచులే నైవేద్యములట
తలపు లోపన నున్న దైవమునకు || ||నిత్యపూజలివివో ||
గమన చేష్టలే అంగరంగ గతియట
తమిగల జీవుడే దాసుడట
అమరిన వూర్పులే ఆలవట్టములట
క్రమముతో శ్రీ వేకంటరాయనికి || ||నిత్యపూజలివివో ||