మనుజుడై పుట్టి
మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దు:ఖ మందనేలా || ||మనుజుడై పుట్టి||
జుట్టెడు కడుపుకై చొరనిచోట్టుచొచ్చి
పట్టెడు కూటికై బతిమాలి
పుట్టిన చోటికే పొరలి మనసువెట్టి
వట్టి లంపటము వదలనేరడుగాన || ||మనుజుడై పుట్టి||
అందరిలోపుట్టి అందరిలో పెరిగి
అందరి రూపము లటు తానై
అందమైన శ్రీ వేంకటాద్రీశు సేవించి
అందరాని పదము అందెనటుగాన || ||మనుజుడై పుట్టి||