మంగాంబుధి హనుమంత
మంగాంబుధి హనుమంత నీ శరణ
మంగవి ంచితిమి హనుమంత || ||మంగాంబుధి హనుమంత||
బాలార్క బింబము ఫలమని పట్టిన
ఆలరిచేతల హనుమంతా
తూలని బ్రహ్మాదులచే వరములు
ఓలి చేకొనిన ఓ హనుమంత || ||మంగాంబుధి హనుమంత||
జలధిదాట నీ సత్వము కపులకు
అలరి తెలిపితివి హనుమంతా
ఇలయు నాకసము నేకముగా నటు
బలిమి పెరిగితివి భళి హనుమంత || ||మంగాంబుధి హనుమంత||
పాతాళము లోపలి మైరావణు –
ఆతల చంపిన హనుమంతా
చేతులు మోడ్చక శ్రీ వేంకటపతి –
నీతల కొలిచే హిత హనుమంత || ||మంగాంబుధి హనుమంత||