అన్నమయ్య కీర్తనలు : నారాయణ నీ నామమె
నారాయణ నీ నామమె గతి యిక
కోరికలు నాకు కొనసాగుటకు || ||నారాయణ నీ నామమె||
పైపై మందుట భవజలధి
దాపు వెనక చింతాజలధి
చాపలము నడుమ సంసార జలధి
తేప యేది ఇవి తెగ నీదుటకు || ||నారాయణ నీ నామమె||
పండెను ఎడమ పాపపురాశి
అండను కుడిని పుణ్యపు రాశి
కొం డను నడుమ త్రిగుణరాశి – యివి
నిండ కుడుచుటకు నిలుకడ యేది || ||నారాయణ నీ నామమె||
కింది లోకములు కీడు నరకములు
అందేటి స్వర్గాలవె మీద
చెంది అంతరాత్మ శ్రీవేంకటేశ నీ –
యందె పరమపద మవల మరేది || ||నారాయణ నీ నామమె||