పలుకు తేనెల తల్లి
పలుకు తేనెల తల్లి పవళించెను
కలికితనముల విభుని కలసినదిగాన || ||పలుకు తేనెల తల్లి||
నిగనిగని మోముపై నెరులు గెలకుల చెదర
పగలైనదాక చెలి పవళించెను
తెగని పరిణతులతో తె ల్లవారిన దాక
జగదేకపతి మనసు జట్టిగొనె గాన || ||పలుకు తేనెల తల్లి||
కొంగుజారిన మెరుగు గుబ్బలొలయగ తరుణి
బంగారు మేడపై పవళించెను
చెంగలువ కనుగొనల సింగారములు దొలక
అంగజగురునితోడ అలసినది గాన || ||పలుకు తేనెల తల్లి||
మురిపెంపు నటన తో ముత్యాలమలగుపై
పరవశంబున తరుణి పవళించెను
తిరువేంకటాచలాధిపుని కౌగిట గలసి
అరవిరై నునుచెమట నంటినది గాన || ||పలుకు తేనెల తల్లి||