అన్నమయ్య కీర్తనలు : పాలజలనిధిలో
పాల జల నిధిలో పాయని
నీ వ ర్ణుడవట నీవా యిపుడు ||పాలజలనిధిలో ||
వెదజల్లు మణుల వేయిపడగలను
చెదరని మెరుగుల శేషునిపై
మృదువు బరువుగా మెల్లనె పొరలుచు
నిదుర వోదువట నీవా యిపుడు || ||పాలజలనిధిలో ||
పరమ మునీంద్రులు పద్మభవాదులు
ఇరువంకల నుతియించగను
అరవిరి మోమున నల్లన నవ్వెడి
నిరతమూర్తివట నీవా యిపుడు || ||పాలజలనిధిలో ||
పగటున సిరి యును పరిగిన ధరణియు
బిగియుచు నడుగులు పిసుకగును
తగు వేంకటగిరి తనరుచు చెలగెడి
నిగమమూర్తివట నీవా యిపుడు || ||పాలజలనిధిలో ||