అన్నమయ్య కీర్తనలు : నవనీతచోర
నవనీ తచోర నమో నమో
నవమహిమార్ణవ నమో నమో ||నవనీతచోర||
హరి నారాయణ కేశవాచ్యుత కృష్ణ
నరసింహ వామన నమో నమో
మురహర పద్మనాభ ముకుంద గోవింద
నర నారాయణ నమో నమో || ||నవనీతచోర||
నిగమగోచ ర విష్ణు నీరజాక్ష వాసుదేవ
నగధర నందగోప నమో నమో
త్రిగుణాతీత దేవ త్రివిక్రమ ద్వారకా –
నగరాధినాయక నమో నమో || ||నవనీతచోర||
వైకుంఠరుక్మిణీవల్లభ చక్రధర
నాకేశవందిత నమో నమో
శ్రీకర గుణనిధి శ్రీ వేంకటేశ్వర
నాకజననుత నమో నమో || ||నవనీతచోర||