పేరంటాండ్లు పాడరే
పేరంటాండ్లు పాడరే పెండ్లి వేళ
సారె సారె నిద్దరికి సంతోష వేళ ||పేరంటాండ్లు పాడరే||
చిత్తజుతల్లికి వేగ సింగారించరె మీరు
తత్తరించేరిదే ముహూర్తపు వేళ
హత్తి తలంబ్రాలు నారాయణుని బోయ మనరే
పొత్తలనిద్దరికి బువ్వపువేళ ||పేరంటాండ్లు పాడరే||
పాలవెళ్ళి కూతురుకు పసవులు నలచరే
చాలించరే జోతి వీడు చదివే వేళ
పాలుపడి పరుపులు పరచరే దేవునికి
నాలుగో దినము నేడు నాగవల్లి కే ||పేరంటాండ్లు పాడరే||
అంది బాగా లియ్యరే అలమేల్మంగకును
కందువ శ్రీ వేంకటేశు క లసే వేళ
గందము కస్తూరి నీ రేఘన రతినలసి
కందుక యిద్దరు నిక కొలువుండే వేళ ||పేరంటాండ్లు పాడరే||