నమిత దేవం భజే
నమిత దేవం భజే నారసింహం
సుముఖ కరుణక్షణం సులభ నరసింహ ం || ||నమిత దేవం భజే ||
విజయనరసింహం వీరనరసింహం
భుజబలపరాక్రమ స్ఫుట నృసింహం
రజనీచర విదళన విరాజిత నృసింహం
సుజనరక్షక మహాశూర నరసింహం || ||నమిత దేవం భజే ||
దారుణ నృసింహం ప్రతాప నరసింహం
చారుకల్యాణ నిశ్చల నృసింహం
ధీరచిత్తావాస దివ్య నరసింహం
సారయోగానంద చతుర నరసింహం || ||నమిత దేవం భజే ||
విమల నరసింహం విక్రమ నరసింహం
కమనీయగుణగణాకర నృసింహం
అమిత సు శ్రీ వేంకటాద్రి నరసింహం
రమణీయ భూషాభిరామ నరసింహ ం || ||నమిత దేవం భజే ||