శోభనమే శోభనమే
శోభనమే శోభనమే
వైభవమున పావన మూర్తికి || శోభనమే శోభనమే ||
అరుదుగ మును నరకాసురుడు
సిరులతో చెరలు దెచ్చిన సతుల
పరువపు వయసుల పదారు వేలను
సొరిది పెండ్లాడిన సుముఖునికి || శోభనమే శోభనమే ||
చెందిన వేడుక శిశుపాలుడు
అంది పెండ్లాడగ నవగళించి
విందు వలెనె తావిచ్చేసి రుకుమిణి
సందడి పెండ్లాడిన స రసునికి || శోభనమే శోభనమే ||
దేవదానవులు ధీరతను
దావతిపడి వారి దరువగను
శ్రీ వనితామణి చెలగి పెండ్లాడిన
శ్రీ వేంకటగిరి శ్రీ నిధికి || శోభనమే శోభనమే ||