రాగం : బౌళి
శ్రీపతి పురనాయక
(చిన తిరుమలాచార్య రచన)
శ్రీపతి పురనాయక జయ
చింతితాభీష్ట దాయక || శ్రీపతి పురనాయక ||
ఉన్నతోన్నత విగ్రహ దాసోపరిస్థానుగ్రహ
సన్నుతామర సుగ్రహా సామవేద పరిగ్రహా || శ్రీపతి పురనాయక ||
జానకీ ప్రియకారక శివ సాధితాఖిల తారక
మానుషాహిత మారక మామకాఘ నివారక || శ్రీపతి పురనాయక ||
శ్రీ వేంకట నాధరూపక సంచిత రఘుకుల దీపక
భావ సంతోష ప్రాపకాఅభంగ మంజుల చాపక || శ్రీపతి పురనాయక ||