రాగం : శుద్ధ ధన్యాసి
సకలము చదివిన
సకలము చదివిన శాస్త్రము లెరిగిన
సుకధ్రువాలిటు చూపినది || సకలము చదివిన ||
భవభవములకును ప్రకృతులు వేరే
భువి నామ రూపములు వేరే
యివలనీ దాస్యంబెప్పుడు వొకటే
కవిసిన నీ మాయ గడచినది || సకలము చదివిన ||
మతము మతమునకు మార్గము వేరే
అతి సంశయములు అవివేరే
గతి నీ శరణము గలిగినదొకటే
ఇతవగు మోక్షంబిచ్చేది || సకలము చదివిన ||
జాతిజాతి యాచారము వేరే
ఆతల మోక్షం బదియొకటే
శ్రీ తరుణీశ్వర శ్రీవేంకటేశ్వర
చేతమాగురుడు చెప్పినది || సకలము చదివిన ||