రాగం : వసంత
సకల సంగ్రహము
సకల సంగ్రహముసకల సంచయము
అకృతసుకృత మిది హరినామం || సకల సంగ్రహము ||
సకల వేదశాస్త్రములసార మిది
సకల మంత్రరాజంబు నిది
సకల పురాణరసముల మధురమిది
అకుటిల పావనం హరినామం || సకల సంగ్రహము ||
సకలతత్వ సంశయఖండన మిది
సకల కర్మనిశ్చయము నిది
సకలవిధి రహస్య ప్రధాన మిది
అకారణహితం హరినామం || సకల సంగ్రహము ||
సకల దేవతాస్వామిప్రియం బిది
సకల లోక రక్షణము నిది
ప్రకటం వేంకటపతి నామాంకిత-
మకించనధనం హరినామం || సకల సంగ్రహము ||