రాగం : రేవతి
వేదంబెవ్వని
వేదం బెవ్వని వెదకెడిని
ఆదేవుని కొనియాడుడీ || వేదంబెవ్వని ||
వేంకటరమణా గోవిందా సంకట హరణా గోవిందా |
గోవిందా హరి గోవిందా వేంకటరమణా గోవిందా || వేదంబెవ్వని ||
అలరిన చైతన్యాత్మకు డెవ్వడు
కలడెవ్వడెచట కలడనిన
తలతుర్వెనిని తను వియోగదశ
యిలనాతడి భజియించుడీ || వేదంబెవ్వని ||
కడగి సకల రక్షకుడిందెవ్వడు
వడినింతయు నెవ్వని మయము
పిడికిట తృప్తులు పితరులెవ్వనిని
తడవిన ఘనుడాతని గనుడీ || వేదంబెవ్వని ||
- Advertisement -
కదసి సకల లోకంబుల వారలు
యిదివో కొలిచెద రెవ్వనిని
త్రిదశ వంద్యుడగు తిరువేంకటపతి
వెదకి వెదకి సేవించుడీ || వేదంబెవ్వని ||