రాగం : హుసేని
వెనకేదో ముందరేదో
వెనకేదో ముందరేదో వె ఱ్ఱి నేను, నా
మనసు మరులు దేర మందేదొకో || వెనకేదో ముందరేదో ||
చేరి మీదటి జన్మము సిరులకు నోమేగాని
ఏరూపై పుట్టుదునో ఎఱగ నేను
కోరి నిద్రించపరచుకొన నుద్యోగింతుకాని
సారె లేతునో లేవనో జాడ తెలియ (నేను) || వెనకేదో ముందరేదో ||
తెల్లవారినప్పుడెల ల్లా తెలిసినతిననేకాని
కల్లయేదొ నిజమేదో కాన నేను
వల్లచూచి కామినుల వలపించేగాని
మొల్లమై నామేము ముదిసిన దెరగ || వెనకేదో ముందరేదో ||
పాపాలుచేసి మరచి బ్రదుకు చున్నాడగాని
వైపుగ చిత్రగుప్తుడు వ్రాయుటెఱగ
ఏపున శ్రీ వేంకటేశు నెక్కడో వెదకేగాని
నాపాలిదైవమని నన్నుగాచు టెరగ || వెనకేదో ముందరేదో ||