రాగం : షణ్ముణప్రియ
సర్వేశ్వరుడే
సర్వేశ్వరుడే శరణ్యము
నిర్వాహకుడు యిన్నిటగాన || సర్వేశ్వరుడే ||
బలుదేవతలకు బ్రహ్మాదులకును
జలనాభుడే శరణ్యము
అలరిన బ్రహ్మాండ మనిసిననాడును
నిలిపె నాతడు యిన్నిటి గాన || సర్వేశ్వరుడే ||
అనేక విధముల నిఖిల జీవులకు
జనార్థనుడే శరణ్యము
అనాధ నాథుడు అంతరాత్మకుడు
అనాధి పతియితడు అటుగాన || సర్వేశ్వరుడే ||
తగు నిశ్చలులగు తన దాసులకును
జగదేకపతే శరణ్యము
చిదురు చేవయగు శ్రీ వేంకటేశుడు
అగు వరములొసగు నటుగాన || సర్వేశ్వరుడే ||