రాగం : షణ్ముఖప్రియ
వెదకిన నిదియే
వెదకిన నిదియే వేదార్థము
మొదలు తుదలు హరిమూలం బు || వెదకిన నిదియే ||
మునుకొని అవయవములు యెన్నైనా
పనివడి శిరసే ప్రధానము
యెనలేని సురలు యెందరు కలిగిన
మనుపటి హరియే మూలంబు || వెదకిన నిదియే ||
మోవని ఇంద్రియములు యెన్నైనా
భావపు మనసే ప్రధానము
యీవల మతములు యెన్ని కలిగినా
మూవురలో హరి మూలంబు || వెదకిన నిదియే ||
యెరవగు గుణములు యెన్ని కలిగినా
పరమ జ్ఞానము ప్రధానము
యిరవుగ శ్రీ వేంకటేశ్వరు నామమే
సరవి మంత్రముల సారంబు || వెదకిన నిదియే ||