Saturday, November 23, 2024

అన్నమయ్య సంకార్తనలు

రాగం : ఆనందభైరవి

ప: ఇట్టి ముద్దులాడి బాలుడేడ వాడు వాని
పట్టి తెచ్చి పొట్టనిండ పాలుబోయరే || ఇట్టిముద్దులాడి||

చ: గామిడై పారిదెంచి కాగెడి వెన్నలలోన
చేమపూవు క డియాల చేయివెట్టి
చీమ కుట్టెనని తన చెక్కింట కన్నీరు జార
మేమరు వాపోవు వాని వెడ్డు వెట్టరే || ఇట్టిముద్దులాడి||

చ: ముచ్చువలె వచ్చి తన ముంగ మురుగులు చేయి
తచ్చెడి ఆ పెరుగులోన తగబెట్టి
నొచ్చెనని చేయితీసి నోరీనెల్ల జొల్లుగార
వొచ్చెలి వాపోవు వాని నూరడించరే || ఇట్టిముద్దులాడి||

చ: ఎప్పుడు వచ్చెనో మా యిల్లు జొచ్చి పెట్టెలోన
చెప్పరాని ఉంగరాల చేయిపెట్టి
అప్పడైన వేంకటాద్రి అసవాలకుడు గాన
తప్పకుండ బట్టివాని తలకెత్తరే || ఇట్టిముద్దులాడి||

Advertisement

తాజా వార్తలు

Advertisement