Saturday, November 23, 2024

అన్నమయ్య సంకార్తనలు

రాగం – మధ్యమావతి
తాళం – ఆదితాళం

ప|| అదివో అల్లదివో హరివాసము
పదివేల శేషుల పడవల మయము || అదివో ||

చ|| అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాసమఖిల మునులకు
నదె చూడు డదె మొక్కుడానందమయము || అదివో ||

చ|| చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మ మయము || అదివో ||

చ|| కైవల్య పథము వేంకటనగమదివో
శ్రీవేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపద రూపమదివో
పావనముల కెల్ల పావన మయము || అదివో ||

- Advertisement -

భావము : తిరుమల పైకి ఎక్కుచూ ఆనందోత్సాహాలతో అన్నమయ్య ఆ కొండనిట్లు కీర్తించుచున్నాడు. ఈ ప్రాంత శ్రీహరికి నివాసము. శేషుని పదివేల పడగలతో నిండి యున్నది. ఈ కొండ లోకాలకు ఎంతో పూజనీయమైనది, ఉన్నతమైనది. బ్రహ్మ మున్నగు వారు కూడా దీని మహత్యము తెలియలేరు. అందరు మునులకు ఇది ఆవాసమైనది. ఇది ఆనందస్వరూపము. దీనిని చూచి నమస్కరించెము. దీని మూలాన సృష్టికి మూలకారణుడగు స్వామి యను ధనమున్నది. బంగారు శిఖరములతో కూడిన ఈ కొండ ఎందరో బ్రహ్మలకు నిలయమైనది. వేంకటాద్రి మోక్షమునకు స్థానము. స్వామికి సంతోషమును కూర్చునది. సర్వసంపదలు ఇచ్చట ఆకారము ధరించినవి. పవిత్రములైన వానిలోకెల్ల ఈ కొండ పవిత్రమయినది. తిరుమల కొండ మహత్యాన్ని అన్నమయ్య రసరమ్యంగా ఈ కీర్తనలో పొందుపరిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement