రాగం : బృందావని
హరి హరి నీ మాయా మహిమ
సరవిదెలియ నను కరుణించగదే || ||హరి హరి నీ మాయా మహిమ||
తలతును నాపాలి దైవమవని నిను
తలతును తల్లివి తండ్రివని
మలసియంతలో మరతును తెలుతును
కలవలె నున్నది కడగనరాదు || ||హరి హరి నీ మాయా మహిమ||
మొక్కుదు నొకపరి మొగి నేలికవని
మొక్కునీ వాది మూలమని
వుక్కున గర్వించి యుబ్బుదు సగ్గుదు
కక్కసమైనది కడగనరాదు || ||హరి హరి నీ మాయా మహిమ||
చూతును నీమూర్తి సులభుడు వనుచును
చూతు జగములకు సోద్యమని
యీతల శ్రీవేంకటేశ న్నేలితివి
కౌతుక మొదవెను కడగనరాదు || ||హరి హరి నీ మాయా మహిమ||