రాగం : సామంత
సహజ వైష్ణవాచార వర్తనుల
సహవాసమె మా సంధ్య || సహజ ||
అతిశయమగు శ్రీహరి సంకీర్తన
సతతంబును మా సంధ్య
మతి రామానుజమతమే మాకును
చతురతమెరసిన సంధ్య || సహజ ||
పరమభాగవత పదసేవనమే
సరవినెన్న మా సంధ్య
సిరివరు మహిమలు చెలువొందగ వే
సరక వినుటే మా సంధ్య || సహజ ||
మంతుకెక్క తిరుమంత్ర పఠనమే
సంతతమును మా సంధ్య
కంతు గురుడు వేంకటగిరి రాయని
సంతర్పణమే మా సంధ్య || సహజ ||