విభుడ వింతటికి వెరవుతో ననుగావు
అభయ హస్తముతోడి ఆదిమూలమా || విభుడవింతటికి ||
పలు లంపటాలచేత పాటుబడి పాటుబడి
అలసితిగావవే వో ఆదిమూలమా
చలమరి యితర సంసార భ్రాంతి చిక్కితిన
న్నలరించి గావవే వో ఆదిమూలమా || విభుడవింతటికి ||
యెంతకైన ఆసలచే యేగేగి వెసరితి
అంతకోప గావవే వో ఆదిమూలమా || విభుడవింతటికి ||