Saturday, November 23, 2024

అన్నమయ్య కీర్తనలు : వాడె వేంకటాద్రి మీద

రాగం : వసంత
వాడె వేంకటాద్రిమీద వరదైవము
పోడిమితో పొడచూపె పొడవైనదైవము || ||వాడె వేంకటాద్రి మీద ||

వొక్కొక్కరోమకూపాన నొగి బ్రహ్మాండకోట్లు
పిక్కటిల్ల వెలుగొందే పెనుదైవము
పక్కనను తనలోని పదునాలుగులోకాలు
తొక్కి పాదానగొలచేదొడ్డదైవము || ||వాడె వేంకటాద్రి మీద ||

వేదశాస్త్రాలు నుతించి వేసరి కానగలేని –
మోదపు పెక్కు గుణాల మూలదైవము
పోది దేవతలనెల్ల పుట్టించ రక్షించ
ఆదికారణంబైన అజుగన్నదైవము || ||వాడె వేంకటాద్రి మీద ||

సరుస శంఖచక్రాలు సరిబట్టి అసురల
తరగి పడవేసిన దండిదయివమూ
సిరి వురమున నించి శ్రీ వేం కటేశుడయి
శరణాగతులగాచే సతమైననదైవము || ||వాడె వేంకటాద్రి మీద ||

Advertisement

తాజా వార్తలు

Advertisement