Saturday, November 23, 2024

అన్నమయ్య కీర్తనలు : వాడె వేంకటేశుడనే వాడే వీడు

వాడె వేంకటేశుడనే వాడే వీడు
వాడి చుట్టుకైదువ వలచేతివాడు || వాడె వేంకటేశుడనే వాడే వీడు ||

కారిమారసుతుని చక్కని మాటలకు చొక్కి
చూరగా వేదాలగుట్టు చూపినవాడు
తీరని వేడుకతో తిరుమంగైయాళువారి
ఆరడి ముచ్చిమికూటికి ఆసపడ్డ వాడు || వాడె వేంకటేశుడనే వాడే వీడు ||

పెరియాళువారిబిడ్డ పిసికి పై వేసిన
విరుల దండల మెడవేసినవాడు
తరుణి చేయివేసిన, దగ్గరి, బుజము చాచి
పరవశమై చొక్కి పాయలేని వాడు || వాడె వేంకటేశుడనే వాడే వీడు ||

పామరుల దనమీది పాటలెల్లా పాడుమంటా
భూమికెల్లా నోర నూరి పోసినవాడు
మామకూతురలమేలుమంగ నాంచారియుదాను
గీముగానే వేంకటగిరి నుండేవాడు || వాడె వేంకటేశుడనే వాడే వీడు ||

Advertisement

తాజా వార్తలు

Advertisement