వలెననువారిదె వైష్ణవము యిది
వలపు దేనెవో వైష్ణవము || వలెననువారిదె ||
కోరిక లుడుగుచు గుఱి నిన్నిటిపై
వైరాగ్యమెపో వైష్ణవము
సారెకు కోపము చలమును తనలో
వారించుటవో వైష్ణవము || వలెననువారిదె ||
సుడిగొను దేహపు సుఖదు:ఖములో
వడి చొరనిదె పో వైష్ణవము
ముడివడి యింద్రియముల కింకరుడై
వడబడ నిదె పో వైష్ణవము || వలెననువారిదె ||
వుదుటున తన సకలోపాయంబులు
వదలుట పో నిజవైష్ణవము
యెదుటను శ్రీ వేంకటేశ్వరు నామము
వదనము చేర్చుట వైష్ణవము || వలెననువారిదె ||