Friday, November 22, 2024

అన్నమయ్య కీర్తనలు : వందేహం జహద్వల్లభం

(పెద తిరుమలాచార్య సంకీర్తన)
వందేహం జహద్వల్లభం దుర్లభం
మందరధరం గురుం మాధవం భూధనం || వందేహం జహద్వల్లభం ||

నరహరిం ముర హరం నారాయణం పరం
హరి మచ్యుతం ఘన విహంగవాహం
పురుషోత్తమం పరం పుండరీకేక్షణం
కరుణాభరణం కలయామి శరణం || వందేహం జహద్వల్లభం ||

నందనిజనందనం నందకగదాధరం
యిందిరానాథ మరవిందనాభం
యిందురవిలోచనం హితదాసవరదం, ము
కుందం యదుకులం గోపగోవిందం || వందేహం జహద్వల్లభం ||

రామనామం యజ్ఞరక్షణం లక్షణం
వామనం కామినం వాసుదేవం
శ్రీమహావాసినం శ్రీ వేంకటేశ్వరం
శ్యామలం కోమలం శాంతమూర్తిం || వందేహం జహద్వల్లభం ||

Advertisement

తాజా వార్తలు

Advertisement