Saturday, November 23, 2024

అన్నమయ్య కీర్తనలు : రాముడు లోకాభి రాముడు

రాగం : ముఖారి
రాముడు లోకాభిరాముడు త్రైలోక్య –
ధాముడు రణరంగ భీముడు వాడె || ||రాముడు లోకాభిరాముడు ||

వరుడు సీతకు ఫలాధరుడు మహోగ్రపు
శరుడు రాక్షస సంహరుడు వాడె
స్థిరుడు సర్వగుణాకరుడు కోదండదీక్షా –
గురుడు సేవక శుభకరుడు వాడే || ||రాముడు లోకాభిరాముడు ||

ధీరుడు లోకైక వీరుడు సకలా –
ధారుడు భవ బంధ దూరుడు వాడే
శూరుడు ధర్మ విచారుడు రఘువంశ
సారుడు బ్రహ్మ సాకారుడు వాడే || ||రాముడు లోకాభిరాముడు ||

బలుడు ఇన్ని రవికులుడు భావించ ని –
ర్మలుడు నిశ్చలుడు అవికలుడు వాడే
వెలసి శ్రీ వేంకటాద్రి నిజనగరములోన
తలకొనె పుణ్యపాదతలుడు వాడే || ||రాముడు లోకాభిరాముడు ||

Advertisement

తాజా వార్తలు

Advertisement