రాగం : కళ్యాణ వసంతం
రమణుడ ఇంతట రారాదా
సమరతి దేరీ జగడము లికను || ||రమణుడ ఇంతట ||
కోవిల తిట్లగోణగుల చేతను
తావులు దప్పెను ధైర్యములు
మావుల చిలుకల మాటవెంగెముల
వావులు మాలెను వలపులు చెలికి || ||రమణుడ ఇంతట ||
కొంచెపు వాయువు కుంటెన తనముల
చంచల మందెను సతి మనసు
పంచల తుమ్మిద బలముల పొంచుల
ఇంచుకించుకే ఎక్కెను చలము || ||రమణుడ ఇంతట ||
విరుల శరంబుల వేండ్ల వాండ్ల
మరులును తెలువులు మగువకును
ఇరవుగ శ్రీవేంకటేశ కూడితివి
సరసపు మాటలు సాగెను కొనకు || ||రమణుడ ఇంతట ||