Tuesday, November 26, 2024

అన్నమయ్య కీర్తనలు : భక్తికొలదీ వాడె

భక్తికొలదివాడే పరమాత్ముడు
భుక్తిముక్తి దానే యిచ్చు భువిబరమాత్ముడు ||భక్తికొలదీ వాడె||

పుట్టినవారిచే బిడ్డ పరమాత్ముడు
బట్టబయటిధనము పరమాత్ముడు
పట్టుపగటివెలుగు పరమాత్ముడు
యెట్టనెదుటనే వున్నాడిదె పరమాత్ముడు ||భక్తికొలదీ వాడె||

పచ్చిపాలలోని వెన్న పరమాత్ముడు
బచ్చనవాసినరూపు పరమాత్ముడు
బచ్చుచేతివొరగల్లు పరమాత్ముడు
యిచ్చ కొలదివాడువో యీ పరమాత్ముడు ||భక్తికొలదీ వాడె||

పలుకులలోనితేట పరమాత్ముడు
ఫలియించు నిందరికి బరమాత్ముడు
బలిమి శ్రీవేంకాద్రిపరమాత్ముడు
యెలమి జీవులప్రాణ మీపరమాత్ముడు ||భక్తికొలదీ వాడె||

Advertisement

తాజా వార్తలు

Advertisement