రాగం : ధన్యాసి
బండి విరిచి పిన్న పాపలతో నాడి
దుండగీడు వచ్చె దోబూచి || బండి విరిచి ||
పెరుగు వెన్నలు ప్రియమున వే-
మరముచ్చిలించు మాయకాడు
వెరువున దన విధము దాచుకుని
దొరదొంగ వచ్చె దోబూచి || బండి విరిచి ||
పడుచు గుబ్బెత పరపుపై పోక
ముడి కొంగు నిద్ర ముంపునను
పడియుతా(?) వద్ద పవళించి నట్టి
తొడుకుదొంగ వచ్చె దోబూచి || బండి విరిచి ||
గొల్లపల్లెలో ఇల్లిల్లూ చొచ్చి
కొల్లలాడిన కోడెగాడు
యెల్లయినా వేంకటేశుడు ఇదె
తొల్లిటి దొంగ వచ్చె దోబూచి || బండి విరిచి ||