రాగం : శ్రీరాగం
ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా
కేలీ విహార లక్ష్మీనారసింహ ||ఫాలనేత్రా ||
ప్రళయ మారుత ఘోర భస్మికా పూత్కార
లలిత నిశ్వాస డోలా రచనయా
కులశైల కుంభీనీ కుముదహిత రవి గగన
చలన విధి నిపుణ నిశ్చల నారసింహా ||ఫాలనేత్రా ||
వివరఘన వదన దుర్విధిహసన నిఘ్నూత
లవదివ్య వరుష లాలా ఘటనయా
వివిధ జంతువ్రాత భువన మగ్నీకరణ
నవనవ ప్రియ గుణార్ణవ నారసింహా ||ఫాలనేత్రా ||
దారుణోజ్జ్వల ధగద్ధగిత దంష్ట్రానల వి-
కారస్ఫులింగ సంగక్రీడయా
వైరిదానవ ఘోర వంశ భస్మీకరణ-
కారణ ప్రకట వేంకట నారసింహా ||ఫాలనేత్రా ||