రాగం : శుద్ధధన్యాసి
పరమాత్ముడైన హరి పట్టపు రాణివి నీవు
ధర మమ్ము విచారించదగు నీకు నమ్మా || పరమాత్మ ||
కమలజు గన్నతల్లి కాముని గన్నతల్లి
అమరుల గన్నతల్లి ఆదిమలక్ష్మి
విమలపు నీపతికి విన్నపము సేసి మమ్ము
నెమకి యేలితి దయ నీకే తగునమ్మా || పరమాత్మ ||
కామధేను తోబుట్టుగ కల్పకము తోబుట్టుగ
దోమటి చల్లని చంద్రు తోబుట్టుగ
నీ మనగి పంపునను నిజసిరులిచ్చితివి
నేమపు వితరణము నీకే తగునమ్మా || పరమాత్మ ||
పాలజలధి కన్యవు పద్మాసనివి నీవు
పాల పండే వేంకటపతి దేవివి
యేలిన ఇతని బంట్లకు ఇహపరాలిచ్చి మా
పాలగలిగితివి సంబంధము మేలమ్మా || పరమాత్మ ||