నాకుగల పని యిదే నారాయణుడ నీవు
శ్రీంకాంతుడవు నాకు సిద్ధించు కొరకు || ||నాకుగల పనియిదే||
జలధి వంటిది సుమీ చంచలము నామనసు
కల వి ంద్రియములనేటి జలచరములు
వొలసి భక్తనిది వోడ యెక్కితి నేను
జలశాయి నీవనేటి సరకు దెచ్చుటకు || ||నాకుగల పనియిదే||
కొండవంటిది సుమీ కొనకెక్కు నా మనసు
వుండు కామాదులను వురు మృగములు
వుండి నీ శరణమను వూతగొని మొక్కితిని
కొండలప్ప నీవనేటి కొన ఫలము కొరకు || ||నాకుగల పనియిదే||
టీ (ఠీ) వులను ధరణి వంటిది సుమీ నా మనసు
నీవే శ్రీ వేంకటేశ నిక్షేపము
వావాత నీవనేటి వసిదవ్వికై కొంటి
భూ విభుడ నీవనేటి పురుషార్థము || ||నాకుగల పనియిదే||