Friday, November 22, 2024

అన్నమయ్య కీర్తనలు : ధరణి

రాగం : దేసాళం
ధరణినెందరెన్ని -తపములు చేసినాను
హరికృప గలవాడే – అన్నిటా బూజ్యుడు || ధరణి ||

మితిలేని విత్తులెన్ని – మేదినిపై జల్లినాను
తతితో విత్తినవే – తగ బండును
ఇతర కాంతులు మఱి – యెందరు గలిగినాను
పతి మన్నించినదే – పట్టపు దేవులు || ధరణి ||

పాలుపడి నరులెన్ని- పాట్లుబడి కొలిచినా
నేలికి చేపట్టిన వాడే – యెక్కుడు బంటు
మూలనెంత ధనమున్నా -ముంచి దాన ధర్మములు
తాలిమితో నిచ్చినదే- దాపురమై నిల్చును || ధరణి ||

ఎన్నికకు గొడుకులు – యెందరు గలిగినాను
ఇన్నిటా ధర్మపరుడే – యీడేరును
ఉన్నతి జదువులెన్ని – వుండినా శ్రీవేంకటేశు
సన్నుతించిన మంత్రమే – సతమై ఫలించును || ధరణి ||

Advertisement

తాజా వార్తలు

Advertisement